ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన ఏ పరికరం అయినా సరైన భద్రతా చర్యలు లేకుండా అటాక్ వెక్టర్‌గా మారుతుందనేది జగమెరిగిన సత్యం. సరైన భద్రతా చర్యలు లేకుండా ఉపయోగించే PCని వివిధ దాడులకు ఒక సాధనంగా లేదా లక్ష్యంగా ఉపయోగించవచ్చు.

పీసీని వైరస్లు, ట్రోజన్లు, కీలాగర్లు, కొన్నిసార్లు నిజమైన హ్యాకర్లు దాడి చేయవచ్చు. దీనివల్ల డేటా చోరీ, డేటా నష్టం, వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం, పాస్వర్డ్లు వంటి క్రెడెన్షియల్స్ చోరీకి దారితీస్తుంది. కాబట్టి మీ పీసీ హ్యాక్ కాకముందే బ్యాకప్ చేసుకోండి.

డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్ సురక్షితంగా ఉపయోగించడానికి కొన్ని ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకోవడం అవసరం. మనకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించడానికి మన పరికరాల భద్రతను నిర్ధారించే ప్రాథమిక భద్రతా చర్యలను పరిశీలిద్దాం.