పరిచయం
డంప్‌స్టర్ డైవింగ్ అనేది ఫిషింగ్, స్పియర్ ఫిషింగ్, ఐడెంటిటీ దొంగతనం మొదలైన సైబర్ దాడుల కోసం మోసగాళ్లు దుర్వినియోగం చేయగల సున్నితమైన లేదా విలువైన సమాచారాన్ని పొందే లక్ష్యంతో ఒక సంస్థ లేదా వ్యక్తి యొక్క ట్రాష్ లేదా రీసైక్లింగ్ బిన్ల ద్వారా శోధించే పద్ధతిని సూచిస్తుంది.
ఇది ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్ యటాక్, ఇది మోసగాళ్ల దుర్వినియోగం కోసం సున్నితమైన సమాచారాన్ని సేకరించడం కోసం మానవ దుర్బలత్వాలను ఉపయోగించుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారంలో రహస్య పత్రాలు, విస్మరించిన కంప్యూటర్ డివైసులు లేదా పాస్‌వర్డ్‌లు, అకౌంట్ నంబర్‌లు లేదా ఇతర వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం వంటి సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉండే ఇతర ఫిజికల్ మీడియా ఉండవచ్చు.
ఉదాహరణలు:
-
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ కాపీలు వంటి రహస్య పత్రాలు మొదలైన వాటి యొక్క విస్మరించిన ఫోటోకాపీల దుర్వినియోగం.
-
విస్మరించిన కంప్యూటర్ డివైస్ ల దుర్వినియోగం.
-
గడువు ముగిసిన క్రెడిట్/డెబిట్ కార్డుల దుర్వినియోగం.
-
బ్యాంక్ స్టేట్‌మెంట్ ప్రింట్ అవుట్‌ల దుర్వినియోగం మొదలైనవి.