ఎర వేయడం అనేది ఒక రకమైన సైబర్-దాడి, ఇక్కడ మోసగాడు బాధితులను ఆకర్షణీయమైన ఎరతో ప్రలోభపెట్టడం ద్వారా మాల్వేర్‌ను డౌన్‌లోడ్ చేసేలా మానిప్యులేట్/ట్రిక్స్ చేస్తాడు. ఎర USB, పెన్‌డ్రైవ్, CD మొదలైన భౌతిక మాధ్యమం కావచ్చు, అది మాల్‌వేర్‌తో కాంప్రమైజ్ అవ్వని/ఆక్రమించబడిన లేదా వాస్తవంగా ఇతర రూపంలో ఉన్న మాల్వేర్ అయిన ఉచిత మూవీ డౌన్‌లోడ్‌ల ద్వారా కావచ్చు. అదనంగా, మోసగాడు ఈ భౌతిక మీడియా పరికరాలను అతేంటిక్ గా కనిపించే, కొన్ని ప్రముఖ కంపెనీ లోగోలు మొదలైన వాటితో లేబుల్ చేయవచ్చు.

ఉదాహరణ:

  • సోకిన పెన్ డ్రైవ్‌లను ఉచితంగా పంపిణీ చేయడం, ఉచిత యాంటీవైరస్, ఉచిత మూవీ డౌన్‌లోడ్ మొదలైనవి,
  • USB, పెన్ డ్రైవ్ మొదలైన సోకిన ఫిజికల్ మీడియా ద్వారా బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడం
  • సినిమాలు, గేమ్‌లు, యాంటీవైరస్ మొదలైన వాటి యొక్క ఉచిత డౌన్‌లోడ్‌లను ప్రకటించడం.